Wednesday 12 March 2014

ఓ పాపలాలి - మాటేరాని చిన్నదాని

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను
చందమమ పట్ట పగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించె ....

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మెలుకొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే ...

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా ..
రేగే మూగ తలపే వలపు పంటరా

Tuesday 30 October 2012

తోట రాముడు - ఓ బంగారు రంగుల చిలక

ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ ఓ ఓ ... ఆ ఆ ఆ .....

పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఆశతో
మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే

ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని


సన్నజాజి తీగుంది, తీగామీద పువ్వుంది, పువ్వులోని నవ్వే నాదిలే 
కొంటె తుమ్మేదొచ్చింది, జుంటి తీనే కోరింది అందించే భాగ్యం నాదిలే 
ఈ కొండల్లో, ఈ కోనల్లో మనకెదురే లేదులే 
ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని 
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని 



కన్నె వయసు - ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 

నీ రూపమే దివ్య దీపమై 
నీ వవ్వులే నవ్య తారలై 
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 


పాల బుగ్గలను లేత సిగ్గులు,  పల్లవించగా రావే 
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే 
పాల బుగ్గలను లేత సిగ్గులు,  పల్లవించగా రావే 
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే 
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన 
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన , రాజ హంసలా రావే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 

నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే 
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే 
నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే 
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే 
పదము పదము లో మధువులూరగా కావ్య కన్యవై రావే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 






Friday 22 June 2012

మెరుపు కలలు - 'వెన్నెలవే వెన్నెలవే ..'

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జోడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన  జోడి  నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా 

ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
చెలి అందాల చెలి ముద్దాడె చిరు మొగ్గల్లొ సిగ్గేసె పున్నాగం, పిల్లా పిల్లా 

భులోకం దాదాపు కన్నుమూయు వేళ, 
వాలెను కుసుమాలు పచ్చగడ్డి మీద
ఏ పువ్వుల్లొ తడి అందాలో అందాలే ఈ వేళ

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన  జోడి  నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన  జోడి  నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా

ఎత్తైన గగనంలో నిలిపే వారెవరంట కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట
యద గిల్లి గిల్లి వసంతాన్ని ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు, పిల్లా పిల్లా
పూతోట నిదరొమని పూలే వరించు వేళ
పూతీగ తన లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జొడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జొడి నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా

Friday 8 June 2012

స్వర్ణ కమలం - 'అందెల రవమిది ..'


గురు బ్రహ్మ
గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
తస్మై శ్రీ గురవే నమహః
ఓం నమో నమో నమశివాయః
మంగళ ప్రదాయ గొపురంగతే నమశివాయః
గంగయా తరంగితొత్తమాంగినే నమశివాయః
ఓం నమో నమో నమశివాయః
శూలినే నమో నమః కపాలినే నమశివాయః
పాలినే విరంచితుండ మాలినే నమశివాయః

అందెల రవమిది పదములదా,
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానంధపు యద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
అందెల రవమిది పదములదా

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయువెగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల
జంగమమై జడ పాడగ
జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా


నయన తేజమే న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వ కారమై
యోచన సకలము య కారమై
నాదం న కారం, మంత్రం మ కారం, శ్తోత్రం శి కారం, వేదం వ కారం, యగ్నం య కారం
ఓం నమశివాయః

భావమె మౌనపు భావ్యము కాద
భరతమె నిరతము భాగ్యము కాద
పూరిల గిరులు తరిగెల తాండవ మాడే వెళ
ప్రాణ  పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగ
ఖగోళాలు పదకింకుణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా