వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జోడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన
జోడి నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
చెలి అందాల చెలి ముద్దాడె చిరు మొగ్గల్లొ సిగ్గేసె పున్నాగం, పిల్లా పిల్లా
భులోకం దాదాపు కన్నుమూయు వేళ,
వాలెను కుసుమాలు పచ్చగడ్డి మీద
ఏ పువ్వుల్లొ తడి అందాలో అందాలే ఈ వేళ
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన
జోడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన
జోడి నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా
ఎత్తైన గగనంలో నిలిపే వారెవరంట కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట
యద గిల్లి గిల్లి వసంతాన్ని ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు, పిల్లా పిల్లా
పూతోట నిదరొమని పూలే వరించు వేళ
పూతీగ తన లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జొడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహన జొడి నీవే
నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగ పంపిస్తా
No comments:
Post a Comment