Tuesday, 30 October 2012

తోట రాముడు - ఓ బంగారు రంగుల చిలక

ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ ఓ ఓ ... ఆ ఆ ఆ .....

పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఆశతో
మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే

ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని

సన్నజాజి తీగుంది, తీగామీద పువ్వుంది, పువ్వులోని నవ్వే నాదిలే 
కొంటె తుమ్మేదొచ్చింది, జుంటి తీనే కోరింది అందించే భాగ్యం నాదిలే 
ఈ కొండల్లో, ఈ కోనల్లో మనకెదురే లేదులే 
ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని 
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని 

కన్నె వయసు - ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 

నీ రూపమే దివ్య దీపమై 
నీ వవ్వులే నవ్య తారలై 
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 

పాల బుగ్గలను లేత సిగ్గులు,  పల్లవించగా రావే 
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే 
పాల బుగ్గలను లేత సిగ్గులు,  పల్లవించగా రావే 
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే 
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన 
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన , రాజ హంసలా రావే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 

నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే 
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే 
నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే 
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే 
పదము పదము లో మధువులూరగా కావ్య కన్యవై రావే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో 
నా మదిలో నీవై నిండిపోయెనే 
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో