ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నీ రూపమే దివ్య దీపమై
నీ వవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
పాల బుగ్గలను లేత సిగ్గులు, పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే
పాల బుగ్గలను లేత సిగ్గులు, పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో, ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన , రాజ హంసలా రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై, కలలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదము లో మధువులూరగా కావ్య కన్యవై రావే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
No comments:
Post a Comment